Thursday, 26 April 2018 »  Login
in
»
Movies » Shiva
I am at

Shiva

Shiva (telugu) - cast, music, director, release date
A still from Shiva
Shiva, a Telugu movie, is not currently screening in Hyderabad.
USER RATING
9.7
53 USERS
RATE
Rating is quick and easy - try it!
 • Cast
  Nagarjuna, Amala, Kota Srinivasa Rao, Raghuvaran, Subhalekha Sudhakar
  1 user says this is wrong.
 • Director
  Ram Gopal Varma
  1 user says this is wrong.
 • Language
 • Genre
 • Release Date
  7th December 1990
  1 user says this is wrong.
 • Closest Theatre
 • Add New Field:
LATEST COMMENT
sridhar on 7th Oct 2014, 11:56pm | Permalink
' శివ ' సినిమా రిలీజ్ అయ్యి పాతికేళ్ళు గడిచాయి.
-----------------------------------------------------
...అయితే ఏంటి?..ట..,ఒరిగిందేమిటి? అసలు ఆ సినిమాతోనే క్రైంని సాంకేతిక పరిజ్ఞానంతో సెల్యులాయిడ్ మీద ప్రేక్షకుల ఒళ్లు గగుర్పాటు అయ్యేలా పిక్చరైజ్ చెయ్యడం మొదలయ్యింది..అని విమర్శించే వాళ్ళకోణానికి నేను వెళ్ళను.

కానీ..' శివ ' కేరక్టర్.. సమాజములో దౌర్జన్యాలని ఒక స్ఫూర్తిదాయక యువకుడు తన స్వంత జీవితాన్ని పక్కనపెట్టి ఎదుర్కోవడానికి ఎలా ముందుకు వచ్చాడు? అసలు గుండాయిజమనే సామజిక రుగ్మతని సమూలముగా రూపుమాపటానికి సొసైటీలో ప్రతివక్కరూ ఆలోచన చెయ్యాలనే అవసరాన్ని దర్శకుడు ఎంతబాగా చెప్పాడు అనే పాయింట్ చర్చల్లో హైలెట్ కాకపోవడానికి.. స్క్రిప్ట్ ని సాంకేతిక నైపుణ్యం డామినేట్ చెయ్యడమే కారణమని చెప్పొచ్చు.

డైరెక్టర్ వర్మ మస్తిష్కంలోని ఆలోచన ఎడాప్ట్ చేసుకుని చేజింగ్ షాట్స్ లోగాని,ఆర్టిస్ట్ ల హావభావాలను రోమాంచితం అయ్యేలా చిత్రీకరించడం కచ్చితముగా సినిమాటోగ్రాఫర్ యస్.గోపాలరెడ్డి ప్రతిభే ( స్టడీ కాం ని ఉపయోగించిన తొలి తెలుగు మూవీ ఇదే ).

ఇక సరసాల సుస్వరాలు మ్రోగించారు లయరాజ ఇళయరాజా. ఉద్విగ్న సన్నివేశాల్లో సౌండ్ రీ రికార్డిస్ట్ దీపన్ చటర్జీ ప్రేక్షకుల గుండెలు దడలాడించారు

అసలు రాజకీయాలు, గుండాయిజం మమేకమయిన ఆ రోజుల్లో ( కొన్ని సన్నివేశాలు వాస్తవాలకి ప్రతీకగా చిత్రీకరించారన్నది ఎవరూ కాదనలేని నిజం. అప్పుడు నేను పత్రికా రంగములోకి అడుగుపెట్టిన విజయవాడ నివాసిని, కొన్ని దౌర్జన్యకర ఘటనలకు ప్రత్యక్ష సాక్షిని ) ' శివ ఇతివృత్తం 'తో సినిమా తీయడం నిజంగా సాహసమనే చెప్పాలి.

ఈ విషయంలో నిర్మాతలు యార్లగడ్డ సురేంద్ర, వెంకట్ అక్కినేనిల ధైర్యానికి మెచ్చుకోలుశాతం ఖచ్చితముగా సింహ భాగమే.

ఈ సినిమా ప్రొడక్షన్ నుండే అత్యున్నత ప్రతిభా సంపన్నులైన ఆర్టిస్ట్ లు,రచయితలు, ప్రఖ్యాత దర్శకులు శివ నాగేశ్వరరావు వంటి డైరెక్షన్ డిపార్ట్ మెంట్ ప్రముఖులు వెలుగులోకి వచ్చి ఆధునిక తెలుగు సినిమా కీర్తి వ్యాప్తికి కారణమయ్యారు.
వర్మలోని కరెంట్ కి ట్రాన్స్ఫార్మర్ అయి శ్రీ నాగార్జున తన మెర్చ్యూర్డ్ జడ్జ్మెంట్ అప్పుడే నిరూపించుకున్నారు.

ఆనాటి సినిమాకి ప్రేక్షకుడిని అయిన నాకు, కాలానుగుణముగా చాలామంది ' శివ సంభందీకులతో ' పరిచయం అయ్యింది అని చెప్పడం స్వాత్కర్ష అయినా.. నా ఆత్మీయులు.నన్ను,నా కుటుంబాన్నిఆప్తులుగా భావించే త్రిపురనేని సాయి చంద్ ( హీరోయిన్ అమల అన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ ), ప్రముఖ ఆర్టిస్ట్ ఆనంద్ కూతురు బేబీ సుష్మ ( మురళి మోహన్ కూతురు 'కీర్తి' కారెక్టర్ )లకు,ఇప్పటి విఖ్యాతి దర్శకులు నాశ్రేయోభిలాషి శివనాగేశ్వరరావులకు, మిత్రులు విలన్ శివ సత్యనారాయణలకు, మరో మిత్రులు స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజాకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ గారికి ఒక డిజైనింగ్ ఆర్టిస్ట్ గా నా ప్రత్యేక నమస్సులు.
ఎందుకంటే ' శివ 'లోగోనే ఒక అద్భుతం.
లోగో టైటిల్ నుండి 16 షీట్ పోస్టర్ వరకు ( అప్పుడు బానర్ ఆర్టిస్ట్ లు పెయింట్ చేసే కట్ అవుట్ లు తప్ప ఇప్పటి ఫ్లెక్సిలు,డిజిటల్ ప్రింటెడ్ పోస్టర్స్ లేవు )
ప్రత్యేకించి వైట్ పోస్టర్లో సిల్హౌట్ షాట్ టైపు లో రైల్వే ట్రాక్ సీన్, ఆర్టిస్ట్ లెవరూ లేకుండా చైన్ చుట్టుకున్నపిడికిలి + శివ లోగో - పోస్టర్ ముందు మాలాంటి చిన్న ఆర్టిస్ట్ లని ఎంతో ఊహాలోకంలో విహరింప చేసేది.ఇక మామూలు జనాన్ని ఈడ్చుకువెళ్లి థియేటర్స్ లో కుదేయటములో ఆశ్చర్యమేముంది? ఈశ్వర్ గారి కుంచెలోంచి వచ్చిన సప్తవర్ణాలు ముందు ఇప్పటి డిజిటల్ ఎఫ్ఫెక్ట్స్ దిగతుడుపే.
' పలికెడివాడు రామభద్రుందట - పలికించెడివాడు రామచంద్రుందట 'లాగ ప్రతిభ వున్నవాళ్ళందరి దగ్గర తనకు కావలసింది రాబట్టుకుని ఆధునిక తెలుగుసినీ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన డైరెక్టర్ నిస్సందేహముగా రాంగోపాల్ వర్మ.
ఇక వర్మ జాతీయ స్థాయిలో ఎంత సంచలనాలకి మారుపేరయ్యారో ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
శ్రీ వర్మ సినీ జీవితములో ఎన్ని ఎత్తుపల్లాలు ఉన్నా..ఆధునిక తెలుగు సినిమాకతడు ఎవరెస్ట్ శిఖరమనతగినవాడు.

జయహో..!' శివ 'టీం.

* వినూత్నంగా 'శివ' డాక్యుమెంటరీ చేసిన 'సిరాశ్రీ టీం'కి అభినందనలు.

- అక్కినేని శ్రీధర్ ( ఆర్టిస్ట్' - జర్నలిస్ట్ ),పంజాగుట్ట,హైదరాబాద్.
0
0
SHIVA REVIEW


In September of 1989, there were some posters coming up here and there that showed a stern-looking young man crossing a railway track, with 4 hockey stick and chain yielding men standing behind, looking on. That has got to be one of the most impactful visuals ever if measured by how many persons' eyes and curiosity it caught. The young man was Nagarjuna, and the posters were for the film Shiva, which went on to become probably the biggest hit that we know of in Telugu movies.

Shiva spawned a mass hysteria: people were standing in queues for over 5 hours for ti....

Share. Save. Connect.
  EMAIL
  PRINT
  SAVE
LEAVE A COMMENT
fullhyd.com has 700,000+ monthly visits. Tell Hyderabad what you feel about Shiva, and then also see all user reviews for Shiva!
Rate Movie
[no link to your name will appear, overriding global settings]
To preserve integrity, fullhyd.com allows ratings/comments only with a valid email. Your comments will be accepted once you give your email, and will be deleted if the email is not authenticated within 24 hours.
My name:

Dissatisfied with the results? Report a problem or error, or add a listing.
ADVERTISEMENT
SHOUTBOX!
ADVERTISEMENT
This page was tagged for
Shiva काटॠन
Shiva telugu movie
Shiva reviews
release date
Nagarjuna, Amala
Follow fullhyd.com on
© Copyright 1999-2009 LRR Technologies (Hyderabad), Pvt Ltd. All rights reserved. fullhyd, fullhyderabad, Welcome To The Neighbourhood are trademarks of LRR Technologies (Hyderabad) Pvt Ltd. The textual, graphic, audio and audiovisual material in this site is protected by copyright law. You may not copy, distribute, or use this material except as necessary for your personal, non-commercial use. Any trademarks are the properties of their respective owners. More on Hyderabad, India. Jobs in Hyderabad.