Nuvvu Nenu Osey Orey cinema chaala baagundi. oka ticket ku vanda navvulu enjoy cheyyaalani anu kuntunnaaraa ayite ee summer special Cinema tappakunadaa chudandi..
MUSICAL IMPRESSIVE...& ... LOVE COMEDY ENTERTAINER ..... Dont miss
ఒక్క టిక్కట్టుకు వంద నవ్వులు “నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ ” సినిమా అనే ప్రచారసాధనంతో చక్కర్లు కొడుతూ మంచి ఆసక్తి రేకెత్తించిన ” నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ ” సినిమా శ్రీమూవీ మేకర్స్ పతకంపై వీరగంగాధర్ నిర్మాతగా, రవిచంద్ర కన్నికంటి డైరెక్టర్ గా ఇద్దరికి తొలి ప్రయత్నం గా సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని అంచనాలను ఎంతవరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం..
కథ : సన్ని (అర్జున్ మహి) తన ప్రెండ్ నడుపుతున్న గ్యారేజిని మూసేసి దుబాయ్ వెళ్ళడంతో డ్రైవర్ జాబు కోసం వెతకడం ప్రారంబించాడు. అలా తిరుగుతున్న అతనికి ఓరోజు రోడ్డు పై జరిగిన ఓ యాక్సిడెంటులొ పి.ఆర్ అనే ఓ కోటీశ్వరుణ్ణి యాక్సిడెంటల్ గా రక్షిస్తాడు. పి.ఆర్ దగ్గర డ్రైవర్ గా జాబులో చేరతాడు. పిఆర్ దగ్గర చేరిన తర్వాత అతని శాడిజానికి అతని కూతురు మైధిలి (అశ్విని) అమాయకత్వానికి మద్య నలిగిపోతూ ఆమెతో ప్రేమలో పడతాడు. ” లాగితన్నడానికి ఓపికుండాలి లేచిపోవడానికి మనీ వుండాలి” ఆ రెండూ లేని అతను దానికి ఈక్వల్ గా ఓ ప్లాన్ వేశాడు .. ఆప్లాన్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంటూ తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు అనేదే ఈ సినిమా…..
ప్లస్ పాయింట్స్ : సినిమాలోని ప్రధాన ప్లస్ పాయింట్స్ అంటే మాటలు, పాటలు, పొటోగ్రఫీ సినిమా చూస్తున్నంత సేపు ఈ మూడు ఒకదానిని ఇంకొకటి డామినేట్ చేస్తాయి. హీరో హీరోయిన్ల మధ్య నడిచే సన్నివేశాలు చాలా బాగా ఉండటంతో పాటు పూర్తి ఫన్ నిండి ఉంటుంది …. అమ్మాయి బుజం మీద చెయ్యేసి కూర్చొమని చెప్పిన తర్వాత ఏ మగాడు కూర్చోకుండా వుంటాడు. ఎక్కడ కూర్చోమంటె అక్కడ చచ్చినట్టు కూర్చుంటాడు…లాంటి మాటలు కట్టిపడేస్తాయి. అలాగె నర్స్ క్యారెక్టర్ మంగ (రితిక) తనని పెళ్ళి చేసుకోమంటూ సన్నీ వెంట పడుతూ …, రోడ్డు మీద హలొ అనేవాడికంటే నైటు కల్లొ కొచ్చేవాడే బెటరని పిక్సయిపోయా…. సాఫ్టు వేరు అమ్మాయిలు డైటింగులంటా నాఎడం చెయ్యి లావుకూడా వుండంలేదు బుజం మీద చెయ్యేసినా నడుంమీద చెయ్యేసినా బొమికలే తగుల్తాయి….అమెరికాలో అబ్బాయిలు శాండల్ వుడ్ లా వుంటారంట, నువ్వేమో యాపమొద్దులా వున్నావు.. లాంటి మాటలు కవ్వించి నవ్వించి పరుగులు పెట్టిస్తాయి. ఈ సినిమాకి బిగ్గెస్టు హైలెట్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫృద్వి. ఇందులొ ఇతని పేరు బికిని, గోడ దూకలేని దొంగ పాత్ర ఈ పాత్ర ఆధ్యంతం కిత కితలు పెట్టిస్తుంది. ఎట్టా ఎరువేసి పెంచిన సొరకాయిలా ఇంతున్నా గుర్తు పట్టలా,, ఒరేయ్ నీ హిట్లర్ ఐడియా దెబ్బకి నా మెదడు పొట్లకాయిలా పగిలిపోయింది.. ఎరుపు మెరుపు బై బర్త్ వచ్చాయ్…… దోపిడి దొంగతనం బై ఎర్త్ వచ్చాయ్ వొళ్ళు బాగా బలిస్తె ముందున్నోడు మమ్మీలా కనపడతాడు లాటి ఇతని మాటలు మనల్ని కిడ్నాప్ చేస్తాయి ఈ సినిమాలో హీరొయిన్ అశ్వని ని ఇదివరకెన్నడూ చూడనంత అందంగా చూపించారు. మంగ కారెక్టర్ లో రితిక తన టాలెంట్ తో బాగా కవ్విస్తుంది. అతి ముఖ్యంగా సినిమా లోని అన్నిపాటలమీద కూడా బాగా శ్రద్ద పెట్టి ఐదు పాటలు వినడానికి చూడడానికి పండుగలాతీర్చిదిద్దారు,బికిని(పృద్వి)కి తెలుగు హీరోస్ అనే స్పెషల్ సాంగ్ దియేటర్ లో మాంచి వూపు తీసుకొచ్చింది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బిగువైన సెకండ్ హాఫ్ సినిమాని ఇంకో రేంజికి తీసికెళ్ళింది.
మైనస్ పాయింట్స్ : ఫస్టాఫ్ మూవీ మాటలు పాటలు ప్రధానంగా సాగుతుంది కధ అనుకున్నంత ఫాస్టుగా సాగదు కాని ఎక్కడా బోరు కొట్టదు. మంగ కారెక్టర్ ఇంకొంచెం పొడిగించి వుంటే బాగుండేది. అలాగే పృద్వి కారెక్టర్ లేట్ గాఎంట్రి ఇవ్వడం లాంటివి కొంచెం సరిదిద్దుకొని వుంటె పస్టు హాఫ్ ఇంకా మంచి సందడిగా వుండేది.
సాంకేతిక విభాగం : ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్ చిత్రం చూడడానికి చాలా బాగుంది. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాని నిర్మించారు, పాటలకు పెద్దపీట వేశారు విజువల్స్ చాలా బాగున్నాయి. కెమెరా మెన్ పనితనం ప్రతి ప్రేములోనూ కనబడుతుంది.సెకండ్ హాఫ్ లో దర్శకుడు రవిచంద్ర కన్నికంటి తన ప్రతిభని చక్కగా కనబరిచాడు ఇతను అందిన మాటలు ప్రేక్షకులకు ఉల్లాసాన్ని సినిమాకు మంచి బూస్టు ను ఇచ్చాయి, పాటల్లొని గ్రాఫిక్స్ ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి.
తీర్పు : ఎ మ్యూజికల్ ఇంప్రెస్సివ్…లవ్ కామెడి ఎన్టర్ టెయినర్ గా వచ్చిన ఈ సినిమా మంచి పేరు తెచ్చుకునే చిత్రమే. మొత్తం మీద చెప్పాలంటే ఈ సినిమా ఫ్యామిలి అంతా కలిసి కూర్చుని హాయిగా ఎంజాయ్ చేసేలా వున్నమంచి సమ్మర్ స్పెషల్ .
ఒక్క టిక్కట్టుకు వంద నవ్వులు
LEAVE A COMMENT
fullhyd.com has 700,000+ monthly visits. Tell Hyderabad what you feel about Nuvvu Nenu Osey Orey!